మలక్‌పేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మత్తుమందు ఇచ్చి లేపేశారు!

శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. శిరీష భర్త వినయ్‌, అతని సోదరి సరిత కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.

New Update
Shirisha , Vinay

మలక్‌పేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. శిరీష భర్త వినయ్‌ కుమార్‌, అతని సోదరి సరిత కలిసి శిరీషను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. శిరీషను ఒప్పించి తన తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చిన ఆడపడుచే చివరకు శిరీషను అంతమొందించడం చూసి పోలీసులే షాకయ్యారు.  అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని మత్తుమందు ఇచ్చి అక్కతో కలిసి కట్టుకున్న భార్యను  హత్య చేశాడు వినయ్. ముందుగా శిరీషకు మత్తుమందు ఇచ్చిన వినయ్..   స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు వినయ్.  

మత్తుమందు ఇచ్చి హత్య

పోలీసులు సరితను ఏ1గా, వినయ్ కుమార్ ను ఏ2గా చేర్చారు. సరిత భర్త విదేశాల్లో ఉండటంతో సరిత అక్రమ సంబంధాలు పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం శిరీషకు తెలియడంతో  ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం మరోసారి గొడవ జరగడంతో శిరీషను అంతమొందించాలని సరిత ఫిక్స్ అయి ఆమెకు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు. శిరీష చనిపోయాక అన్న, చెల్లెలు ఇద్దరూ ఆమెకు గుండెపోటు వచ్చిందని నాటకం ఆడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అయితే శిరీష మేనమామ మధుకర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు వినయ్‌, సరితలను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 

బుధవారం హంతకులిద్దరిని పోలీసులు మీడియా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.  కాగా శిరీష కంటే ముందు ఇద్దర్ని పెళ్లి చేసుకున్న వినయ్.. మొదటి భార్యను ఇలాగే హత్య చేశాడని..  రెండో భార్య అతని వేధింపులు భరించలేక ఇల్లు వదిలి పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.  అలాగే శిరీషను కూడా వారు కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెలింది.  శిరీషకు తల్లిదండ్రులు లేరని తెలుసుకుని వినయ్‌ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.  వినయ్ నేర చరిత్ర తెలియని శిరీష అతన్ని నమ్మి బంధువులను కాదని మరీ వినయ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

Also read :  Muslim population : రాబోయే 25 ఏళ్లలో అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు