Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
అలోవేరా జ్యూస్ అనుకొని ఓ14 ఏళ్ల బాలిక పురుగుల మందు తాగి మరణించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీపాంజలినగర్ కు చెందిన నిధి కృష్ణ అనే బాలికకు రోజూ అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకొని తాగేసింది.