హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 4లో ఉన్న ఓ పబ్‌లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌కి వెళ్లిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 100 మంది యువకులు ఉండగా. 42 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Karimnagar: అర్థరాతి ఎమ్మెల్యేకు నగ్న వీడియో కాల్.. తర్వాత ఏమైందంటే?
కస్టమర్లను ఆకర్షించాలనే..
కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసుల దాడిలో తేలింది. పోలీసులు దాడి చేసే సమయానికి అక్కడ మొత్తం 100 మంది యువకులు ఉన్నారు. వెంటనే వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా.. రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం!
అసభ్యకరమైన డ్యాన్సులు వేసే యువతులు మద్యం తాగినట్లు కస్టమర్లను నమ్మిస్తారు. వారి బిల్లులను కూడా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా మద్యానికి బానిస అవుతున్నారో.. అలాంటి యువకులనే టార్గెట్ చేస్తు్న్నారు. పబ్ గురించి తెలియక వెళ్లిన వారి జేబులను నిర్వాహకులు ఖాళీ చేయిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Putin: ఇండియన్ సినిమాలంటే మాకు ఎంతో ఆసక్తంటున్న రష్యా అధ్యక్షుడు!
హైదరాబాద్ సిటీలో పబ్, డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. యువత ఎక్కువగా వీటికి బానిస అవుతున్నారు. ఈ మోడ్రన్ కల్చర్ బాగా అలవాటు పడి వీకెండ్ వస్తే ఇక పబ్‌ల్లోనే గడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. యువత మాత్రం వీటికే అలవాటు పడుతున్నారు.
ఇది కూడా చూడండి: బాలయ్య కాళ్లు మొక్కిన హోమ్ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో