AP News: ఏపీలో హైకోర్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ కేసులో భాగంగా న్యాయస్థానం ముందు నగ్నంగా విచారణకు హాజరుకావడం చర్చనీయాంశమైంది. అందరూ చూస్తుండగానే ఒంటిపై బట్టలు లేకుండా జడ్జీ ముందుకు రావడం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. ఇప్పటికే రాజకీయ నాయకుల నగ్న వీడియోలు సంచలనం రేపుతుండగా.. ఇప్పుడు ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!
మంచంపై నగ్నంగా పడుకొని..
ఈ మేరకు అక్టోబర్ 15న హైకోర్టులో ఓ కేసు విచారణ జరిగింది. అయితే సదరు వ్యక్తి కేసు విచారణకు ఆన్ లైన్‌లో హాజరయ్యాడు. కిట్టు అనే యూజర్ ఐడీతో యాప్ ద్వారా 17వ కోర్టు విచారణలోకి లాగిన్ కాగా.. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా మంచంపై నగ్నంగా పడుకొని తన వాదనలు వినిపించాడు. అయితే మంచంపై నగ్నంగా పడుకుని ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్షం కావడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా విఘాతం కలిగించాడంటూ సదరు వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో
వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు..
ఈ క్రమంలోనే సిబ్బందిని అప్రమత్తం చేసిన న్యాయస్థానం.. అతడి లాగిన్ బ్లాక్ చేశారు. హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ
ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?