AP Crime: భార్య కళ్ళ ముందే రాళ్లతో కొట్టి కొట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్‌ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. అతడి భార్య వనిత కళ్ళ ముందే రాళ్లతో కొట్టి కొట్టి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

New Update

AP Crime: కట్టుకున్న భార్య ముందే భర్తను రాళ్లతో, కర్రలతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఓ వైపు భర్త చనిపోతున్న బాధ.. మరోవైపు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది.

భార్య కళ్ల ముందే..

మదనపల్లి బైపాస్ రోడ్డులో గంగాధర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే నిన్న రాత్రి అతడి ఇంట్లో చొరబడిన కొందరు దుండగులు అతడిని దారుణంగా హత్య చేశారు. భార్య వనిత కళ్ల ముందే కర్రలతో,రాళ్లతో కొట్టి చంపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్త్తు చేస్తున్నారు. హత్య గల కారణాలను అన్వేషిస్తున్నారు.గంగాధర్ మరణంతో అతడి భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు