జానీ మాస్టర్ వివాదంలో బన్నీ హస్తం.. 'పుష్ప2' నిర్మాత ఏమన్నారంటే!

జానీ మాస్టర్, లేడీ డ్యాన్సర్ వివాదంలో అల్లు అర్జున్ హస్తం ఉందనే వార్తలను 'పుష్ప2' నిర్మాత మైత్రి రవి ఖండించారు. 'ఇది పూర్తిగా వారిద్దరి పర్సనల్ ఇష్యూ. బన్నీకి ఏమీ తెలియదు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాయి' అన్నారు.

sd
New Update

Jani master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో నటుడు అల్లు అర్జున్ ప్రమేయం ఉందనే వార్తలను 'పుష్ప 2' నిర్మాత మైత్రి రవి ఖండించారు. లేడీ డాన్సర్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఈ వివాదం పూర్తిగా జానీ, బాధితురాలి మధ్య జరిగిన పర్సనల్ ఇష్యూ అని అన్నారు.  అయితే 'పుష్ప 2' సినిమా మొదలు నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్ గా ఆమెను లేడీ డాన్సర్ గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉందని తెలిపారు. 

అలాగే జానీ మాస్టర్ తోనూ మరో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. సెట్ బిహైండ్ థాట్ ఏమీ జరుగుతుందనేది అల్లు అర్జున్ కు తెలియదు. గొప్ప స్టేచర్ ఉన్న అల్లు అర్జున్ పై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయి. జానీ మాస్టర్ ఆ లేడీ డాన్సర్ మధ్య వివాదం పూర్తిగా వారి వ్యక్తిగతం. పుష్ఫ టీమ్, ఇతరులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.  

#allu-arjun #pushpa-2 #jani-master
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe