Viral Video: గోల్డ్ షాప్ ఓనర్ కంట్లో కారం కొట్టిన కిలాడీ.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..!

అహ్మదాబాద్ రణిప్‌లో ఒక మహిళ ఓనర్ కంట్లో కారం కొట్టి బంగారు దుకాణంలో దోపిడీ ప్రయత్నం చేసింది. దుకాణ యజమాని తక్షణమే ప్రతిస్పందించి 17 సార్లు ఆమె చెంపపై కొట్టి ఆమెను ఆప్ ప్రయత్నం చేసాడు కానీ మహిళ పారిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరలైంది.

New Update
Viral Video

Viral Video

Viral Video: అహ్మదాబాద్ లో రణిప్ ప్రాంతంలో జరిగిన ఒక వినూత్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక ఆమె బంగారు దుకాణంలో యజమాని కంట్లో కారం కొట్టి దోపిడీ ప్రయత్నం చేసింది, కానీ దుకాణం యజమాని తక్షణమే స్పందించి ఆమెపై దాడికి దిగాడు. 

వివరాల ప్రకారం,  మొహాన్ని దుపట్టాతో కప్పుకొని, కస్టమర్ లా వేషం మార్చి దుకాణంలోకి ప్రవేశించింది ఓ మహిళ. గోల్డ్ చూపించమని అడుగుతూ యజమానిని మాటల్లో పెట్టి వెంటనే తెచ్చుకున్న కారం తీసి యజమాని కంట్లో కొట్టేసింది.

Also Read: స్కూల్‌ స్టోర్ రూమ్ లో 10 అడుగుల పాము.. వైరల్ వీడియో!

Ahmedabad Glod Shop Robbery

అయితే, యజమాని తక్షణమే రియాక్ట్ అయ్యాడు. కారం పొడి అతని కళ్ళకు పడ్డది కానీ అతను వేగంగా స్పందించి ఆమెను 17 సార్లు వెంట వెంటనే చెంపపై కొడుతూనే ఉన్నాడు. తర్వాత కౌంటర్ మీద నుండి దూకి ఆమెను బయటకు లాగి అదుపులోకి తీసుకున్నాడు. CCTV వీడియోలో ఈ మొత్తం ఘటన స్పష్టంగా రికార్డు అయ్యింది.

Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!

పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. CCTV ఆధారంగా ఆ మహిళను గుర్తిస్తున్నారు పోలీసులు. అహ్మదాబాద్ పోలీస్ ఆమెను కనుగొని ఫిర్యాదు నమోదు చేయమని వ్యాపారిని రెండు సార్లు కలిసారు. 

అయితే, ఆ మహిళ పోలీస్ రాకముందే అక్కడి నుంచి పారిపోయింది. పోలీసులు ఇప్పటికీ CCTV వీడియో ఆధారంగా ఆమెను శోధిస్తున్నారు. ఈ ఘటన వీడియో ద్వారా బయటకు వచ్చాక, సోషల్ మీడియాలో పెద్దగా చర్చనీయాంశం అయ్యింది. యజమాని వెంటనే స్పందించిన ధైర్యవంతమైన చర్యకు ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన చిన్న ఫిల్మ్ సీన్స్‌ లా అనిపించినప్పటికీ, నిజ జీవితంలో జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.  CCTV వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు