AP BREAKING: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురు స్పాట్ డెడ్!

కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

AP BREAKING: కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక సావరం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి  తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  

గత  40 సంవత్సరాలుగా

కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన ఎలుగుబంట్ల ఈ బాణాసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గత  40 సంవత్సరాలుగా  ఆయన ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. చుట్టు పక్కన ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బాణాసంచా కేంద్రాల్లో సత్తిబాబు పరిశ్రమ కూడా ఒకటి. 

Advertisment
తాజా కథనాలు