AP : కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీ అధికారుల తీరుపై దళితుల ఆందోళన..!
కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఆధికారుల వైఖరిని నిరసిస్తూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి నోటీసులు జారీచేయకుండా కొబ్బరి చెట్లకు బహిరంగ వేలం వేయడంతో బాధితులు మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
AP : అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం.. ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు.!
కోనసీమ జిల్లా వెల్ల గ్రామం అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.
Fire Accident: భారీ అగ్నిప్రమాదం..15 - 20 లక్షల ఆస్తి నష్టం.!
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ షాపులో మంటలు చెలరేగడంతో షాపు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక మినీ వ్యాన్, కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.