Bengaluru : దారుణం: ఇంట్లోకి చొరబడి మహిళపై సామూహిక అత్యాచారం

బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
benguluru

బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన మహిళ. ఆమె బెంగళూరులో అద్దె ఇంట్లో నివసిస్తోంది. మంగళవారం (అక్టోబర్ 21) రాత్రి 9:30 గంటల నుంచి 12:15 గంటల మధ్య ఈ అమానుష ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం మత్తులో మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. వారిలో ముగ్గురు మహిళను వేరే గదిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

బాధిత మహిళ ధైర్యం చేసి

అత్యాచారం తర్వాత, నిందితులు బాధితురాలి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు, రూ. 25 వేల నగదును కూడా దొంగిలించి పరారయ్యారు. బాధిత మహిళ ధైర్యం చేసి మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరంలో భాగమైన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని బెంగళూరు రూరల్ ఎస్పీ సీకీ బాబా వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 "ఈ సంఘటన నిన్న రాత్రి 9.30 నుంచి 12.15 గంటల మధ్య జరిగింది. నిందితులు బాధితురాలి తలుపు తట్టి, లోపలికి చొరబడి, ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ. 25,000 కూడా దొంగిలించారు" అని ఎస్పీ సికె బాబా తెలిపారు. బెంగళూరు నగరంలో మహిళల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు