Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. 10 మంది స్పాట్ డెడ్!

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్‌పూర్‌ రోడ్డులో వ్యాను, కంటైనర్‌ ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు.  అదే సమయంలో 20 మందికి పైగా గాయపడ్డారు.

New Update
road accident (1)

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్‌పూర్‌ రోడ్డులో వ్యాను, కంటైనర్‌ ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు.  అదే సమయంలో 20 మందికి పైగా గాయపడ్డారు.  ప్రమాదంలో గాయపడిన చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్యల పెరిగే అవకాశం ఉంది.  గాయపడిన వారందరినీ దౌసా నుండి జైపూర్‌కు తరలించారు. రాజస్థాన్‌లోని సాలాసర్ బాలాజీ ఆలయం నుండి తిరిగి వస్తుండగా పిక్ అప్ వ్యాన్ కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా  యూపీలోని ఎటా జిల్లాలోని అస్రౌలాకు చెందినవారని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు