New Update
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఈ నిబంధన జూన్ లో జరగబోయే వరల్ఢకప్ టీ20 నుంచి అమలు కానుంది. అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
ఏ దేశంలో లేనంతగా మన దేశంలో క్రికెట్ కు ఎక్కువ ఆధరణ లభిస్తుంది. ప్రపంచ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఎప్పుడు జరిగిన ప్రపంచ దేశాల కళ్లు భారత్ పైనే ఉంటాయి. అలాంటి క్రిెకెట్ ఆట లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మరో కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఐసీసీ క్రికెట్ ను ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటి కప్పుడు కొత్త నిబంధనలు ప్రవేశ పెడుతుంది. అలాంటి నిబంధననే ఒకటి తీసుకు వస్తుంది. అదే స్టాప్ క్లాక్ రూల్. ఏంటీ ఈ స్టాప్ క్లాక్ రూల్ అని అనుకుంటున్నారా? ఓవర్ల మధ్యలో సమయాన్ని వృథా చేయకుండా చూసి,మ్యాచులను త్వరగా ముగించేలా ఈ స్టాప్ క్లాక్ రూల్ ని ఐసీసీ తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ రూల్ ను వన్టే ,టీ 20 లాంటి పరిమిత ఓవర్లలో అమలవుతుంది ఐసీసీ తెలిపింది. జూన్ నెలలో జగబోయే వరల్డ్ కప్T20 నుంచి ఈ నిబంధన అమలుకానుంది. న్ని నెలల క్రితమే ఐసీసీ స్టాప్ క్లాక్ రూల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది.
Advertisment