/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T165050.360-jpg.webp)
RCB Team : బాలీవుడ్(Bollywood) నటి అనుష్క శర్మ(Anushka Sharma) ఇటీవల తన 36వ పుట్టినరోజు(Birthday) జరుపుకుంది. ఈ పుట్టిన రోజును ఆమె భర్త విరాట్ కోహ్లి(Virat Kohli) మరింత ప్రత్యేకంగా చేశారు. బర్త్ డే సందర్భంగా అనుష్క కోసం చాలా ప్రైవేట్ డిన్నర్ పార్టీ(Private Dinner Party) ని ఏర్పాటు చేశారు విరాట్. చాలా తక్కువ మంది సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, వారి భాగస్వాములతో కలిసి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. క్రికెటర్ మను చంద్ర కూడా ఈ పార్టీకీ హాజరయ్యారు.
View this post on Instagram
ఇందుకు సంబంధించిన ఫోటోలను క్రికెటర్ మను చంద్ర తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో పర్పుల్ సిల్క్ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్‌లో అనుష్క.. బ్లాక్ షర్ట్ లో విరాట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. క్రికెటర్ మను చంద్ర ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. సంతోషకరమైన వ్యక్తులు, మంచి ఆహరం మనోహరమైన సాయంత్రం. పుట్టినరోజు శుభాకాంక్షలు అనుష్క శర్మ అని తెలిపారు.
Also Read: Hero Nikhil: చీరాలలో హీరో నిఖిల్ సందడి.. అభివృద్ధి కోసం ఆ పార్టీని గెలిపించండి..!