Dhoni: వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్.. ఫోటోస్‌పై ఓ లుక్కేయండి..!!

టీమిండియా మాజీ రథసారధి మహేంద్రసింగ్ ధోనీ న్యూ లుక్‌లో మెరిసిపోతున్నాడు. ఆలిమ్ హ‌కిమ్ అనే హెయిర్ స్టయిలిస్ట్‌ ధోనీకి చెందిన కొత్త ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ధోని చాలా స్టయిలిస్ లుక్‌తో, కొత్త త‌ర‌హా హెయిర్ స్టయిల్‌తో డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. వావ్.. వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Dhoni: వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్.. ఫోటోస్‌పై ఓ లుక్కేయండి..!!

MS Dhoni New Hair Style: మహేంద్ర సింగ్ ధోని.. ఆయనకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహీ తన హెయిర్ స్టైల్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆ లాంగ్ హెయిర్ తో ధోని వస్తుంటే హాలీవుడ్ కటౌట్ వస్తోందని చెప్పేవారు. కానీ ఎందుకో ధోని (MS Dhoni) లాంగ్ హెయిర్ ను కంటిన్యూ చేయలేదు. కానీ ఇటీవల బాగా హెయిర్ ను పెంచేసిన ధోని వింటేజ్ లుక్ (Dhoni Vintage Look) తో అభిమానులను అలరించడానికి సిద్హమయ్యాడు. మరోసారి ధోని లూజ్ హెయిర్ తో కనిపించాడు. బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అభిమానులను కొత్త స్టైల్ తో షాక్ కు గురిచేశాడు.

publive-image

మహేంద్రసింగ్ ధోనీ ఏది చేసినా సంచలనమే. తాజాగా సరికొత్త హెయిర్ స్టయిల్ తో ధోనీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'కెప్టెన్ కూల్' గా పిలువబడే ధోని శైలిని కాపీ చేయడానికి అభిమానులు ప్రయత్నిస్తూ ఉంటారు. ధోని టీమిండియాలో చోటు సంపాదించుకున్న కొత్తలో పొడవాటి జుట్టుతో ఉండేవాడు. 2007లో ICC T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తర్వాత తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకున్నాడు. ఇప్పుడు మరో సారి తన లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేశాడు ధోని.

publive-image

తాజాగా ఓ యాడ్ కోసం ధోనీ హెయిర్ స్టయిల్ మార్చినట్లు తెలుస్తోంది. జుట్టును పొడవుగా పెంచి, లైట్ గా గోల్డ్ కలర్ వేసి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. కొత్త హెయిర్ స్టయిల్ తో ఉన్న ధోనీ పిక్ ను  ప్రముఖ  హెయిర్ స్టయిలిస్ట్ అలీమ్ హకీమ్ (Aalim Hakim)ఇన్స్టాలో షేర్ చేశాడు. మరోవైపు ధోనీతో పని చేయడం పట్ల అలీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ధోనీ హెయిర్ ను స్టయిల్ గా చేసేందుకు చాలా ప్లాన్ చేశానని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  వావ్.. వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్ళిన బాక్సింగ్, ఆర్చరీ అథ్లెట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు