Betting Kills : క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనం.. రూ.1.5 కోట్ల అప్పు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

కర్ణాటకలోని చిత్రదుర్గలో 24 ఏళ్ల రంజీత ఆత్మహత్య చేసుకుంది. రంజీత భర్త దర్శన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో మూడేళ్లుగా రూ.1.5 కోట్లు పొగొట్టుకున్నాడు. అప్పు తీసుకోని మరీ బెట్టింగ్‌లు వేశాడు. వడ్డీ కట్టమని దర్శన్‌ భార్యను అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకుంది.

New Update
Betting Kills : క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనం.. రూ.1.5 కోట్ల అప్పు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

Cricket Betting : బెట్టింగ్‌ ఒక మానసిక రోగం.. ఈ రోగం ఐపీఎల్‌(IPL) టైమ్‌లో బాగా ముదురుతుంది. నిజానికి బెట్టింగ్‌ చేసేవారిలో ట్రూ క్రికెట్‌ లవర్స్‌(True Cricket Lovers) సంఖ్య చాలా తక్కువ. కేవలం బెట్టింగ్‌ వెయ్యడం కోసమే క్రికెట్‌ మ్యాచ్‌(Cricket Match) లు చూసే వారి సంఖ్య టీ20 ఫార్మెట్‌ ఎంట్రీ తర్వాత బాగా పెరిగింది. ఎందుకంటే మూడు గంటల్లో ఫలితం తెలిపోతుంది. ఠీవీగా టీవీ ముందు కూర్చొని మొబైల్‌ను టుకూ టుకూ అని టైప్‌ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చన్నది సోమరిపోతుల ఫీలింగ్‌. నిజమే ఇలాంటి వారిని అలానే పిలవాలి. తప్పే లేదు. బెట్టింగ్‌లో వేలు, లక్షలు, కోట్లు పొగొట్టుకుని కేవలం వారి జీవితాలనే కాకుండా ఇంట్లోవారి జీవితాలను కూడా నాశనం చేయడం వీరికే చెల్లుతుంది. బెట్టింగ్‌కు ఇండియా(India) లో చట్టబద్ధత లేదు.. బెట్టింగ్‌పై ప్రజలకు కనీస అవగాహన కూడా ఉండదు.. అయినా కష్టపడకుండా లక్షలు కావాలి.. కోట్లు సంపాదించాలనే అత్యాశ మాత్రం ఉంటుంది. ఈ అత్యాశ కన్నవారిని, సొంతవారిని, అయినవారిని పొగొట్టుకునే అంత ఉంటుంది. తాజాగా మరోసారి అదే జరిగింది. క్రికెట్ బెట్టింగ్‌ కోసం ఒకడు చేసిన అప్పు అతని భార్యను బలి తీసుకుంది.

చంపేసిన బెట్టింగ్:
కర్ణాటక చిత్రదుర్గలోని రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ దర్శన్ బాలు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) లో సుమారు రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. బకాయిలు చెల్లించకపోవడంతో కుటుంబని పరువు తీస్తామని అప్పు ఇచ్చిన వారు బెదిరించారు. ఇదే క్రమంలో దర్శన్ బాలు భార్య 24 ఏళ్ల రంజిత మార్చి 19న తన పడకగదిలో శవమై కనిపించింది. దర్శన్ కు డబ్బులు ఇచ్చిన 13 మంది ఆమెకు పదే పదే ఫోన్లు చేసి వేధించారు. దీంతో ఈ టార్చర్‌ను తట్టుకోలేకపోయిన రంజీత ఆత్మహత్య చేసుకున్నారు. తనకు వడ్డీ వ్యాపారుల నుంచి ఎదురైన వేధింపులను వివరిస్తూ రంజిత సూసైడ్ నోట్ రాశారు. దీనిపై రంజీత తండ్రి వెంకటేశ్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.

క్రికెట్ బెట్టింగ్ లో దర్శన్ రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడని తాము అనుమానిస్తున్నామని, అయితే అప్పుగా తీసుకున్న డబ్బులో ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాడని వెంకటేశ్‌ చెబుతున్నారు. అయితే దర్శన్ ఇంకా రూ.54 లక్షల వరకు బకాయి పడ్డాడని సమాచారం. తన అల్లుడు నిర్దోషి అని వెంకటేశ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెట్టింగ్ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తామని అప్పు ఇచ్చిన వారే హామీ ఇచ్చారని అంటున్నారు.

Also Read : మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు!

Advertisment
తాజా కథనాలు