/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cm-jagan-1-jpg.webp)
Elections : ఏపీ సీఎం జగన్(AP CM Jagan) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(CPI K Ramakrishna) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశం అని దుయ్యబట్టారు. పేదల భూములు దోపిడి అవుతాయని తెలిపారు. మద్యపానం నిషేదించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్.. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు.
Also Read: రెండేళ్లలో పోలవరం పూర్తి.. అమరావతి రాజధాని.. అమిత్ షా కీలక హామీలు
వైసీపీ పాలన అంతా అరాచకమేనని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయం అని అన్నారు. నరేంద్ర మోదీ(PM Narendra Modi) దేశాన్ని కార్పోరేట్ లకు దారాదత్తం చేశారని.. దేశంలో నరేంద్రమోదీ, ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించండాలని కోరారు.