Bigg Boss : పల్లవి ప్రశాంత్‌ సూసైడ్‌ చేసుకుంటాడేమో : సీపీఐ నారాయణ!

కేవలం ప్రశాంత్‌ మీద కాదు..బిగ్‌ బాస్‌ మేనేజ్‌మెంట్‌, హోస్ట్‌ నాగార్జున మీద కూడా కేసులు నమోదు చేయాలని సీపీఐ నారాయణ అన్నారు. '' ఓ రైతు బిడ్డ మీద కేసులు పెట్టి వేధించడం , హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు.అతను ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
CPI Narayana: జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

CPI Narayana : బిగ్‌బాస్‌(Bigg Boss 7 Telugu) ఇప్పటి వరకు 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత ఆదివారం బిగ్‌బాస్ 7 సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌(Pallavi Prasanth) నిలిచాడు. కార్యక్రమం ముగిసిన తరువాత ప్రశాంత్‌ పోలీసుల సూచనలను ఉల్లంఘించినందుకు అతని పై కేసు నమోదు చేయడంతో అందరూ ప్రశాంత్‌ అరెస్ట్ తప్పదు అని అందరూ భావించారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కూడా గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు..అతను పరారీలో ఉన్నాడనే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అతని గురించి వెదుకుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నేను ఎక్కడికి పారిపోలేదు. మా ఇంటి వద్దనే ఉన్నాను.

కావాలనే కొందరు నా పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయించాలని చూస్తున్నారని ఓ ఎమోషనల్‌ వీడియోను ప్రశాంత్‌ విడుదల చేశాడు. నేను ఏ తప్పు చేయలేదు. కావాలనే నన్ను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారంటూ అతను వాపోయాడు. ఇదంతా ఇలా ఉంటే..అసలు ముందు నుంచి కూడా బిగ్‌ బాస్‌ షో మీద మంచి అభిప్రాయం లేని సీపీఐ నారాయణ దీని గురించి స్పందించాడు.

కేవలం రైతు(Farmer) బిడ్డ ప్రశాంత్‌ మీద కాదు..బిగ్‌ బాస్‌ మేనేజ్‌మెంట్‌ తో పాటు హోస్ట్‌ నాగార్జున మీద కూడా కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు. '' బిగ్‌ బాస్‌ లో పాల్గొన్న వారి పై పోలీసులు ప్రతాపం చూపడం సరికాదు. ఓ రైతు బిడ్డ మీద కేసులు పెట్టి వేధించడం , హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు. ప్రస్తుతం ప్రశాంత్‌ పరారీలో ఉన్నాడు..అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడు. అతను కానీ ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? తక్షణమే అతని మీద పెట్టిన కేసులన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలి. ఈ విషయాన్ని పోలీసులు బహిరంగంగా చెప్పాలి.

ప్రశాంత్‌..నువ్వెక్కడున్నా కూడా సీపీఐ ఆఫీసుకు రా..మేం నీకు రక్షణ కల్పిస్తాం అంటూ సీపీఐ నారాయణ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్‌ అడ్వకేట్ రాజేశ్‌ కూడా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ లేదు. కేసు నమోదు చేసినప్పుడు కనీసం నిందితునికి ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వాలి కాదు. అప్పుడే కాదా నిందితునికి బెయిల్‌ కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

Also read: ‘హిందీ నేర్చుకోవాల్సిందే..’ ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలని నితీశ్‌కు డీఎంకే చురకలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు