Tollywood : నటుడు పృథ్వీరాజ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకంటే! నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడస్థానిక ఫ్యామిలీ కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేసింది.గత కొంతకాలంగా భార్య శ్రీలక్ష్మికి , పృథ్వీ కు విభేదాలు నడుస్తున్నాయి. ఆమెకు భరణం చెల్లించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి 30 Years Industry Prudhvi Raj : 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) కు కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ (Vijayawada) స్థానిక ఫ్యామిలీ కోర్టు (Family Court) అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. పృథ్వీకి, ఆయన భార్య శ్రీలక్ష్మికి మధ్య గత కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.. శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పక్కన పెట్టిన పృథ్వీ.. ఈ కేసును హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం పృథ్వీకి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశాలిచ్చింది.. అయితే, పృథ్వీ రాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులతో తిరిగి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి బుధవారం పృథ్వీ రాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటు (Non Bailable Arrest Warrant) జారీ చేశారు. Also read: మామ హత్యకు కోడలు కోటి సుఫారీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే! #non-bailable #prudhvi-raj #tollywood #arrest #30-years-industry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి