Naresh Malli Pelli Movie: ప్రముఖ నటుడు డాక్టర్ వికె నరేష్(Naresh) మాజీ భార్య రమ్య రఘుపతి మళ్ళీ పెళ్లి(Malli Pelli)( తెలుగు), మట్టే మదువే ( కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేస్తూ 2023 ఆగస్టు 1న తీర్పును వెలువరించింది.
పూర్తిగా చదవండి..మళ్ళీ పెళ్లి విడుదలపై దాఖలైన కేసును కొట్టివేసిన సిటీ సివిల్ కోర్టు | నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం
సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతికి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. మళ్ళీ పెళ్లి సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని న్యాయస్థానం తెలిపింది. మళ్ళీ పెళ్లిపై రమ్య రఘుపతి వేసిన పిటిషన్లో సరైన ఆధారాలు లేవని తెలపింది. రమ్య రఘుపతి పటిసన్ను కొట్టివేస్తోన్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.
Translate this News: