Supreme Court Summons to Ramdev Baba : ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పతంజలి యాడ్స్(Patanjali Ads) ఉన్నాయనే కేసులో కోర్టుకు సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా(Ramdev Baba) విఫలమయ్యారని సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం మొట్టికాయలు వేసింది. దిక్కార పిటిషన్ మీద సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పడు ఈ విషయంలో ఆయుర్వేద సంస్థ వ్యస్థాపకుల్లో ఒకరైన రామ్‌దావ్ బాబాతో పాటూ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కూడా కోర్టుకు హాజరు కావాలని సమన్లను జారీ చేసింది.
అంతకు ముందు తప్పుడు ప్రకటనలు చేసినందుకు పతంజలి ఉత్పత్తుల యాడ్స్ పై సుప్రీం కోర్లు పూర్తిగా నిషేదం విధించింది. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ అలాంటి యాడ్స్‌ను ప్రచారం చేడం మీద కోర్టు మండిపడింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలకు ధిక్కార నోటీసులను పంపించింది.
అలాంటి యాడ్స్ ఎలా వేస్తారు...
తమ ఆయుర్వేద ఉత్పత్తులు కరోనా వైరస్(Corona Virus) లాంటి భయంకరమైన వ్యాధులను నయం చేస్తుందంటూ గతంలో పతంజలి యాడ్స్ వేసింది. రెండేళ్ల క్రితం ఈ యాడ్ తెగ హల్ చల్ చేసింది. దీంతో వీటి మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయత, రుజువులు లేకుండా ప్రచారం చేయడంపై ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా రామ్ దేవ్ బాబా మీద ఐపీసీ 188,269,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఈ అంశంపై జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎహ్సానుద్దిన్ అమానుల్లాతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై పతంజలి ఆయుర్వేద ఉత్తత్తుల యాడ్స్ తక్షణమే నిషేదించాలని ఆదేశించారు. దాంతో పాటూ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిన కారణంగా యాజమాన్యానికి కోటి రూపాయలు జరిమానా ఎందుకు విధించకూడదంటూ ప్రశ్నించింది. ఇలాంటి యాడ్స్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని.. అయినా కూడా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదనిధర్మాసనం ఆగ్రహించింది. మళ్లీ కోర్టు అనుమతించే వరకు పతంజలి ప్రకటనలపై పూర్తిగా నిషేధం విధించింది.
Also Read : Bengaluru: బెంగళూరు మేఘనా ఫుడ్స్ మీద ఐటీ దాడులు