Video Viral: 54 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఇటీవల సంభవించింది. కొన్ని దేశాల్లో నేరుగా చూసే అవకాశం లభించలేదు. కేవలం సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించాల్సి వచ్చింది. US, కెనడా, మెక్సికో అంతటా ఈ అరుదైన సంఘటన కనిపించింది. ఇలాంటి అరుదైన సూర్యగ్రహణం రోజు అరుదైన సంఘటన జరిగింది. ఓ జంట సూర్యగ్రహణం సాక్షిగా పెళ్లి ప్రమాణం చేశారు.
ఏప్రిల్ 8 గ్రహణం రోజున ప్రత్యేకంగా పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నారు. గ్రహణం సమయంలో ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించి సూర్యగ్రహణాన్ని చూసుకుంటూ ఉంగరాలు మార్చుకున్నారు. అంతేకాకుండా పెళ్లికి వచ్చిన అతిథులు కూడా గ్రహణం చూస్తూ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి వీడియో గ్రాఫర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు జంట ప్రతిజ్ఞ చేసింది. ఇలాంటి అరుదైన ఘట్టాన్ని సోషల్ మీడియాలో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. సూర్యగ్రహణం రోజు పెళ్లి చేసుకోవడం అరుదుగా సంభవిస్తుందని, అది కూడా 54 ఏళ్ల తర్వాత వస్తున్న గ్రహణం రోజు పెళ్లి చేసుకోవడం ఎంతో అదృష్టం అంటున్నారు. చాలా మంది మేము కూడా ఇలాంటి అరుదైన సంఘటన జరిగేటప్పుడే పెళ్లి ప్లాన్ చేసుకుంటామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన ఐడియా ఎలా వచ్చింది బ్రో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అపార్ట్‌మెంట్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన పని చూడండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.