దేశాన్ని విడిచిపోయిందనుకున్న మహమ్మారి మరోసారి రూపం మార్చుకొని దేశంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. కరోనా (Covid) ..ఈ పేరు చెబితేనే ఇప్పటికీ చాలా మంది కంట నీరే వస్తుంది. ఎందుకంటే అది మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. ఎందరికో తల్లిదండ్రులని, మరేందరికో బిడ్డల్ని దూరం చేసిన మహమ్మారి.
మరోసారి దేశంలో కరోనా డేంజర్ బేల్స్ మోగుతున్నాయి. రోజురోజుకి ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో మరోసారి వైద్యశాఖ అప్రమత్తం అవుతోంది. దేశంలో ఒక్కరోజే సుమారు 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే ఐదుగురు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వైద్యశాఖాధికారులను అలర్ట్ చేసింది.
చనిపోయిన ఐదుగురిలో నలుగురు కేరళలోనే మరణించారు. మరోకరు ఉత్తర్ ప్రదేశ్ లో చనిపోయారు. గడిచిన రెండు సంవత్సరాల్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టినట్లే అనిపించింది. దీంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటుపడిపోయారు. కానీ పోయిందనుకున్న పీడ మళ్లీ మొదలయ్యిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 1,701 కేసులు ఉన్నాయని తెలిపారు. అసలే చలికాలం కావడంతో ఈ వైరస్ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేరళలో కరోనా కొత్తరకం వేరియంట్ జేఎన్ 1 కేసులు కూడా నమోదు కావడంతో మరింత ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది.
దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ప్రజలు తామంతట తామే స్వచ్ఛంధంగా మాస్క్ లు పెట్టుకుని తిరగాలని..అంతేకాకుండా భౌతిక దూరం కూడా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also read: బాలయ్య సరసన తమన్నా..కానీ హీరోయిన్ గా కాదు!