Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు!
కార్తీక మాసం ముగియడంతో నాన్ వెజ్ ప్రియులందరూ చికెన్ షాపుల ముందు క్యూ కట్టారు. డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులు ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి వరకు రూ. 130 నుంచి 180 వరకు ఉన్న ధరలు ఈరోజు ఒక్కసారిగా 220 నుంచి 260 కి పెరిగాయి.