Corona Care: కరోనాతో కలవరం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, కరోనా గురించి కంగారు పడొద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌గా ఉండొచ్చని చెబుతున్నారు వైద్యులు.

New Update
Corona Care: కరోనాతో కలవరం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

Corona Alert: హమ్మయ్య ఇక పోయిందిరా అనుకున్న కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. జనాలను హడలెత్తిస్తోంది. జేఎన్-1 పేరుతో కొత్త వేరియంట్ దూసుకొస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసిన ఈ మహమ్మారి.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రధానంగా మన ఇండియాలోకి ఎంటరై.. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అందునా మన తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో జేఎన్-1 వేరియంట్ కేసులు 15 నమోదయ్యాయి. దీంతో జనాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. చలికాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. అవసమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు, ఆరోగ్య నిపుణులు.

వైద్యులు, అధికారుల సూచనలివే..

☛ బయటకు వెళ్తున్నప్పుడు, రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లను ధరించి జాగ్రత్తగా ఉండాలి.
☛ జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. ఏమైనా అనుమానం ఉంటే.. కరోనా పరీక్ష చేయించుకోవాలి.
☛ 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు.
☛ చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి.
☛ ఇతరులతో కరచాలనం చేయకుండా నమస్కారం చేయడమే ఉత్తమం.
☛ తప్పనిసరి అయితేనే బయటి ప్రయాణాలు చేయాలి.
☛ విందులు, వినోదాలు తగ్గించుకోవడం ఉత్తమం.
☛ జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
☛ కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలి.
☛ ప్రతిరోజు గోరువెచ్చటి నీటిని తాగాలి.
☛ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
☛ ఇంటి లోపల వెచ్చటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
☛ పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలి.

Also Read:

కరీంనగర్ ప్రజలకు శుభవార్త.. ఇక వారానికి 4 రోజులు..

 టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..

Advertisment
తాజా కథనాలు