Inter Exams : ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే.. క్రిమినల్ కేసే..విద్యార్థులకు అధికారుల హెచ్చరిక! తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలో పరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 26 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Criminal Case : మరో రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షలు(Inter Exams) ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(Telangana Intermediate Education) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలో పరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు(Criminal Case) నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వారిని డిబార్ చేస్తామని ప్రకటించింది. కేవలం విద్యార్థులను మాత్రమే కాకుండా ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, అధ్యాపకులు, కాలేజీ యజామాన్యం మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం 4,78,718 మంది విద్యార్థులు హాజరవుతుండగా.. 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1, 521 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు అన్ని కూడా విద్యార్థులకు హాల్ టికెట్లు(Hall Tickets) ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 6 నుంచే ఆర్టీసీ బస్సు(RTC Bus) లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను కోరారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 6 నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను కోరారు. విద్యార్థులకు ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించేందుకు ఒక ఏఎన్‌ఎంను నియమించి నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నారు. విద్యార్థులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావొద్దని, ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ని తీసుకుని వస్తే మాత్రం సెంటర్ల వద్ద భద్రత అధికారులుకు ఇవ్వాలని తెలిపారు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్ ఫోన్లను లోపలికి తీసుకురాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఈ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే మరో రెండు రోజుల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికారులు విద్యార్థులకు కొన్ని కీలక సూచనలు చేశారు. - విద్యార్థులు తమతో పాటు కచ్చితంగా హాల్ టికెట్ తీసుకుని రావాలి - మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదు. - ఎగ్జామ్ సెంటర్ కు 45 నిమిషాల ముందే చేరుకోవాలి. - ఒక్క నిమిషం లేటైనా లోనికి అనుమతి లేదు.. అనే నిబంధనను దృష్టిలో పెట్టుకోవాలి. - ఇంటి వద్ద నుంచి ముందుగానే బయల్దేరాలి. లేకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. - ప్యాడ్ లు వంటివి ఎగ్జామ్ హాల్ లోనికి అనుమతి లేదు. Also Read : అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి! #criminal-case #inter-exams #copying #malpracticing #telangana-intermediate-education మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి