Hyderabad: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. శనివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. శనివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్తో పాటు వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. తాజాగా హైదరాబాద్తో పాటు మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మరో రెండు మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బలమైనా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలానే చెరువులు, కుంటలు నిండుకున్నాయి.