Congress: స్క్రీనింగ్ కమిటీ సీనియర్‌ నేతలు.. మరి వారి పరిస్థితి ఏంటి.?

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..
New Update

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్ వర్గానికి షాక్‌ తగిలిందా..? పార్టీ అధిష్టానం రేవంత్ వర్గాన్ని కాదని సీనియర్లను స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడంతో రేవంత్ వర్గం నేతల్లో భయాందోళన నెలకొనే అవకాశం ఉందా.. గతంలో పార్టీ సీనియర్లపై దుమ్ముత్తిపోసిన రేవంత్‌ వర్గానికి చెందిన నేతలు.. ఇప్పుడు సైలెంట్‌ కావడానికి కారణమేంటి.? మీడియా ముందు సొంత పార్టీ నేతలపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ శ్రేణుల రాజకీయ ముగిసినట్లేనా..

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించడంలో వేగం పెంచింది. ఇందుకోసం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నుంచి సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మధు యాష్కీలను స్క్రీనింగ్ కమిటీల్లోకి తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ధరఖాస్తు చేసుకున్న నేతల గుండెల్లో భయం పట్టుకుంది. గతంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు సీనియర్‌ నేతలపై బహరంగ విమర్శలు చేశారు. దీంతో తమకు టికెట్‌ వస్తుందా లేదా అని వారు భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ముగ్గురు నేతలు సీనియర్‌ నేతలే కావడం గమనార్హం.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సొంత పార్టీ నేతలే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జి అద్దంకి దయాకర్‌ గతంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌ రెడ్డి పార్టీలో పంచాయతీ పెట్టాలని చూస్తున్నారని, ఆయన పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌ రెడ్డి పార్టీలో లేకుండా తామే తరిమేస్తామని అద్దంకి దయాకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్‌ను ఫైనల్‌ చేసేది వీరే కాబట్టి దయాకర్‌ స్థానంలో తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా జ్ఞాన సుంధర్‌కు అవకాశం ఇచ్చి ఛాన్స్‌ ఉంది.

మరోవైపు గతంలో కాంగ్రెస్‌ సీనియర్‌లపై చెలరేగిపోయిన పార్టీ నేతలు.. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్‌ కోసం పార్టీ సీనియర్లు చెప్పినట్లుగా నడుచుకుంటామని, తాము పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంత కష్టమైన పని అయినా చేస్తామని చెపుకుంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సీనియర్లకు టికెట్‌ ఇస్తుందా లేక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తుందా అనేది.

#congress #telangana #uttam-kumar-reddy #madhu-yashki #venkat-reddy #screening-committee #revanth-category #utkantha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe