ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. ఆగస్ట్ మొదటి వారంలో బస్సుయాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్న పీసీసీ.. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. By Karthik 24 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్న పీసీసీ.. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎదురు చూస్తున్నారన్నారు. తమ బస్సు యాత్రలోనే జిల్లా స్థాయి నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర గ్రామస్థాయిలో ఉంటుందని, యాత్రలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకురానున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తామని జీవన్ రెడ్డి వివరించారు. బస్సు యాత్రలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రామాలను ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. తాము బస్సు యాత్రను ప్రతీ గ్రామంలో నిర్వహించి రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి చెబుతామన్నారు. ఆగస్టు మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నాలుగు బృందాలుగా విడిపోయి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు వెళ్లడించారు. తాము నిత్యం జనంలో ఉండేలా కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థులకు, నిరుద్యోగులకు చేస్తున్న మోసాలపై ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్సీ అన్నారు. స్కాలర్ షిప్‌లు ఇవ్వకుండా విద్యార్థులకు చేస్తున్న మోసాలను వారి తల్లిదండ్రులకు వెల్లడిస్తామని, దీంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తుందని, ప్రతీ పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్‌కు ఎలక్షన్ కమిటీలో చోటు దక్కాల్సిందన్న జీవన్ రెడ్డీ.. ఆయనకు పార్టీ ఇతర కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తుంది పేర్కొన్నారు. కాగా ఈ నెల (జూలై) 30న ప్రియాంకా గాంధీ తెలంగాణకు రానున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ.. యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఇదే సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆమె హస్తం పార్టీలోకి అహ్వానించనున్నారు. జూపల్లితో పాటు మరికొందరు కాంగ్రెస్ తీర్థంపుచ్చుకునే అవకాశం ఉంది. పార్టీలో చేరేవారిలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనిత,. మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, ఏనుగు రవీందర్ సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ మ్యాన్ ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాని సునీల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయితో పాటు దిలీప్, మందుల సామేల్, కోదాడకు చెందిన నేత శశిధర్, జడ్పీ చైర్‌పర్సన్లు సునీతా మహేందర్ రెడ్డి, సరిత కాంగ్రెస్‌లో చేరనున్నారు. #congress #elections #bus-yatra #mlc #jeevan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి