Jairam Ramesh: కాంగ్రెస్, బీజేపీ పార్టీల నడుమ మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది. తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. మోదీ ప్రభుత్వం సాధారణ భారతీయుల నుండి క్రోనీ కార్పొరేట్‌లకు సంపదను హరించడానికి సహాయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ పద్ధతికి స్వస్తి చెబుతుందని పేర్కొంది.
ALSO READ: సహజీవనం చేసేందుకు ఇస్లాం మతం ఒప్పుకోదు.. కోర్టు సంచలన తీర్పు
రాహుల్ గాంధీ అదానీ, అంబానీలను నిందించడం, విమర్శలు చేయడం మానేశారని.. ఇందుకు కారణం ఆ ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీగా నగదు వచ్చి ఉంటుందేమో అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. జూన్ 4న, కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాధారణ భారతీయ కుటుంబాలు అతిపెద్ద లబ్ధిదారులకు భరోసా ఇస్తూ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. భారతీయ పేద కుటుంబాల సంపదను క్రోనీ కార్పొరేట్‌లకు ఇచ్చే పద్దతికి అంతం పలుకుతాం అని అన్నారు.
"హమ్ దో హమారే దో'' అని మోదీ ప్రభుత్వం ప్రభావం గత మూడేళ్లలో నికర గృహాల పొదుపులు 9 లక్షల కోట్లు తగ్గాయని అన్నారు. 2014 నుండి నిజమైన కుటుంబ పొదుపులు అత్యల్పంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ భారత దేశ సంపాదనను లూటీ చేశారని ఆరోపించారు. భారత్ కే పరివార్ నుండి మోడీ కా పరివార్ అయిందని ఎద్దేవా చేశారు.