Congress MP Ticket War: కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కాగా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. అసలు ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
ALSO READ: సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థులు.. సస్పెండ్!
కరీంనగర్ లో కాంగ్రెస్ నేత కన్నీళ్లు!..
కాంగ్రెస్ నేత, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అలిగారు. గత కొన్ని రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ టికెట్ వెలిచాలకే ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగడంతో.. తనకు టికెట్ రాదేమోలే అని అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కోసం తన సీటును త్యాగం చేశారు అలిగిరెడ్డి. తనకోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన అలిగిరెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పిస్తానంటూ పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వెలిచాల పేరు తెరపైకి తీసుకురావడంతో అలిగిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు కాకుండా వేరే వాళ్లకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే బీజేపీలో చేరుతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. మరి మంత్రి అయ్యేందుకు పొన్నం ప్రభాకర్ కు సాయం చేసిన ప్రవీణ్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇస్తుందా? లేదా హ్యాండ్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి.