BJP : లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరో వివాదంలో చిక్కుకుంది. 26/11 దాడికి పాల్పడిన అజ్మల్ కసబ్ "అమాయకుడు" అని మహారాష్ట్ర(Maharashtra) కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దీనిపై బీజేపీ(BJP) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పాకిస్థాన్ నుంచి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తోందని బీజేపీ విమర్శలు గుప్పించింది.
అసలు విజయ్ వాడెట్టివార్ ఏం అన్నారు..
హేమంత్ కర్కరే మరణించింది అజ్మల్ కసబ్(Ajmal Kasab) లాంటి ఉగ్రవాదుల తూటాల వల్ల కాదని అన్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్. ఆయన్ను చంపింది ఆర్‌ఎస్‌ఎస్‌కి సన్నిహితుడైన ఒక పోలీస్ అధికారి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వాస్తవాన్ని బయటకు రాకుండా ఉజ్వల్ నికమ్ దాచిపెట్టారని.. అతను దేశ ద్రోహి అని అన్నారు. ఆయనలాంటి ద్రోహికి బీజేపీ ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిందని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.." దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?.. పాకిస్థాన్‌కు వెళ్లి ఓట్లు అడుగుతున్నారా?.. ఉజ్వల్ నికమ్‌కు టికెట్ ఇచ్చిన తర్వాత విపక్ష నేతలు కసబ్ పరువు తీశారని అంటున్నారు. ముంబై పేలుళ్లకు పాల్పడ్డ అజ్మల్ కసబ్‌పై ఆయన ఆందోళన చెందుతున్నారు.'" అని ఘాటు విమర్శలు చేశారు.
Also Read : జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు..