MLA Seethakka: పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్పా..!!

ములుగు జిల్లాలో పోరాడితే పోయేదేమీ లేదు. మా అయితే బానిస సంకెళ్లు తప్పా.. అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారు. ప్రజల పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం. నూతన మండలానికి జేడీ మండలంగా నామకరణం చేయాలి.

MLA Seethakka: పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్పా..!!
New Update

ములుగు జిల్లాలో పోరాడితే పోయేదేమీ లేదు. మా అయితే బానిస సంకెళ్లు తప్పా.. అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారు. ప్రజల పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం. నూతన మండలానికి జేడీ మండలంగా నామకరణం చేయాలి. మండల సాధన సమితి నాయకులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క శాలువాతో సన్మనించారు. ఈ రోజు మల్లంపల్లి మండలం నూతనంగా ఏర్పాటు జరగడంతో.. ప్రజలతో కలిసి సంబరాల్లో సీతక్క పాల్గొన్నారు.

ప్రత్యేక ధన్యవాదాలు

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గత 10 ఏళ్లగా మల్లంపల్లి ప్రజలు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారానే ఈరోజు మండలం సాధ్యం అయిందన్నారు. మల్లంపల్లి మండలం కావాలని ఆమె వ్యాఖ్యానించారు. అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న క్రమంలో నేను ఈ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా అసెంబ్లీలో బయట ముఖ్యమంత్రి, మంత్రుల, రాష్ట్రంలో ఉండే అధికారుల దృష్టకి తీసుకు పోవడం జరిగిందన్నారు. సబ్బండ వర్గాలు మల్లంపల్లి మండల సాధన కోసం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముఖ్యంగా యువత అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపారు. మీ యొక్క ఉద్యమాల ద్వారా చిరకాల స్వప్నం అయిన మల్లంపల్లి మండలం సాదించుకున్నందుకు నూతనంగా ఏర్పాటు జరిగిన మల్లంపల్లి మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోరాడితే పోయేదేమీ లేదు మా అయితే భానిస సంకెళ్లు తప్పా అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారని సితక్క వ్యాఖ్యానించారు.

అనేక విజయాలు సాధించాం

మన పోరాటాలు.. మన త్యాగాలు.. మన ఉద్యమాల ద్వారానే అనేక విజయాలు సాధించాం అనే దానికి ఇదే నిదర్శనం అన్నారు. మన హక్కులను కాపాడుకోవడానికి అందరం కలసి కట్టుగా పోరాటాలు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆమె కితబుపలికారు. ఈ నేపథ్యంలో మల్లంపల్లి ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మీ ఉద్యమంలో నేను భాగస్వామిని.. మీరు చేస్తున్న పోరాటాలకు, ఉద్యమాలకు మద్దతు తెలుతున్నాను అన్నారు. అసెంబ్లీలో బయట మీ గళాన్ని వినిపించడం జరిగిందన్నారు. నూతన మండల అభివృద్ధికి అందరం కలసి పని చేస్తామని సీతక్క అన్నారు. అనంతరం మండల జాక్ నాయకులను శాలువాతో సన్మనించారు సీతక్క. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను బీఆర్ఎస్‌ ప్రభుత్వం అమ్ముకుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం యువతను తప్పుదారి పట్టిస్తోందని సీతక్క మండిపడ్డారు.

#congress #mulugu-district #visit #mla-sitakka #mallampally-mandal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe