Rajasthan MLA: ముఖ్యమంత్రికి వెంట్రుకలు పంపిన సొంత పార్టీ ఎమ్మెల్యే!

సమస్యల గురించి సీఎంకి విన్నవించినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి పరిష్కారాలు దొరకక పోవడంతో ఆయన వినూత్న పద్దతిలో సీఎంకి నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుండు చేయించుకుని ఆ వెంట్రుకలను ముఖ్యమంత్రికి పంపించారు. దాంతో పాటు ఓ లేఖ కూడా ఆయన సీఎంకి పంపారు.

Rajasthan MLA: ముఖ్యమంత్రికి వెంట్రుకలు పంపిన సొంత పార్టీ ఎమ్మెల్యే!
New Update

MLA Bharat Singh : రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రికి సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్‌ గెహ్లట్‌(Ashok Gehlot) ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయనను , ఆయన పని తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారిలో సంగోడ్ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ ఒకరు.

ఎన్నో సార్లు ఆయన సమస్యల గురించి సీఎంకి విన్నవించినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి పరిష్కారాలు దొరకక పోవడంతో ఆయన వినూత్న పద్దతిలో సీఎంకి నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుండు చేయించుకుని ఆ వెంట్రుకలను ముఖ్యమంత్రికి పంపించారు. దాంతో పాటు ఓ లేఖ కూడా ఆయన సీఎంకి పంపారు.

ఆ లేఖలో ఆయన '' మీరు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి పట్టం కడుతున్నారు. రాష్ట్ర గనుల మంత్రి ప్రమోద్‌ భయ (Pramod Bhaya) అవినీతికి ఎంతో బహిరంగంగా మద్దతు తెలిపారు. ఖాన్‌ కీ జో ప్రియా గ్రామాన్ని (Khan Ki Jhopriya village) మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా కోటా జిల్లాలో చేర్చలేదు. మీ మీద గౌరవం, నమ్మకం, విశ్వాసం చచ్చిపోయాయి. అందుకే నేను గుండు చేయించుకున్నాను.. ఆ వెంట్రుకలను కూడా మీకు పంపుతున్నాను.

ముఖ్యమంత్రి పదవి అనేది శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నారేమో..అది ఎప్పటికీ శాశ్వతం కాదు అంటూ లేఖలో పేర్కొన్నారు. అశోక్‌ గెహ్లత్‌ గాంధీ సిద్దాంతాలను అనుసరిస్తే..గనుల శాఖ మంత్రి ప్రమోద్‌ జైన్ మాత్రం అవినీతినే రహదారిగా చేసుకుని ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు కోట జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

హెరిటేజ్‌ రివర్ ఫ్రంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అశోక్‌ గెహ్లాత్‌ మంగళవారం వెళ్లాల్సి ఉంది . కానీ ఆయన పర్యటన ఆఖరి నిమిషంలో రద్దు అయ్యింది.

Also Read: వియాత్నంలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి. 50మందికి పైగా మృతి..!!

#mla #cm #rajasthan #ashok-gehlot #pramod-bhaya #khan-ki-jhopriya-village #mla-bharat-singh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe