Congress Bus Yatra: తెలంగాణకు రానున్న రాహుల్, ప్రియాంక గాంధీ.. అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారంభం..

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖారారైంది. ఈ నెల 18,19,20 తేదీల్లో వారు రాష్ట్రంలో బస్సు యాత్ర చేయనున్నారు. ముందుగా అక్టోబర్ 18న ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాహుల్, ప్రియాంక ముందు నుంచే శివ భక్తులు కావడంతో.. శివునికి పూజ చేసిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు.

Rahul Gandhi Birthday  : వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే!
New Update

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖారారైంది. ఈ నెల 18,19,20 తేదీల్లో వారు రాష్ట్రంలో బస్సు యాత్ర చేయనున్నారు. ముందుగా అక్టోబర్ 18న ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాహుల్, ప్రియాంక ముందు నుంచే శివ భక్తులు కావడంతో.. శివునికి పూజ చేసిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అలాగే అదే రోజు భూపాలపల్లిలో మహిళలతో సమావేశమై నిరుద్యోగులతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. 19వ తేదీన పెద్దపల్లి జిల్లా రామగుండానికి రానున్నారు. అక్కడ సింగరేణి కార్మికులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత పెదపల్లిలో సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఇక 20వ తేదీన జగిత్యాల, ఆర్మూర్,ల బోధన్, నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ముందుగా బోధన్‌లో బీడీ కార్మికులతో, గల్ఫ్ కుటంబాలతో సమావేశమై.. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లనున్నారు.

Also Read: కోచింగ్ బంద్ చేసి ఊర్లకు వెళ్లండి.. బీజేపీకి ఓటు వేయించండి.. యువతకు బండి సంజయ్ పిలుపు.

ఆ తర్వాత ఆర్మూర్‌లోని పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అక్కడే పసుపు, చెరకు రైతులతో సమావేశమైన అనంతరం నిజామాబాద్‌లో పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ బస్సుల యాత్ర మూడు విడుతలుగా చేయనున్నారు. మొదటి విడుతలో అక్టోబర్ 18,19,20 తేదీల్లో బస్సు యాత్ర ఉంటుంది. దసరా పండుగ తర్వాత రెండోసారి.. అలాగే నామినేషన్ల ప్రక్కియ ముగిసిమ తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుంది.

#telangana-elections-2023 #congress-party #telangana-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe