Casting Couch : షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

కేరళలోని కాంగ్రెస్ మహిళా నేత సిమీ రోస్‌ బెల్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని సిమీ రోస్‌ ఇటీవల ఆరోపించారు. దీనిపై స్పందించిన కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ (KPCC) తాజాగా ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

New Update
Casting Couch : షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

Simi Rosebell : కేరళ (Kerala) లోని కాంగ్రెస్ మహిళా నేత సిమీ రోస్‌ బెల్‌పై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) ఉందని ఇటీవల ఆమె వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (KPCC) సిమీ రోస్‌ బెల్‌కు పార్టీ సభ్యత్వం తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మంది మహిళలను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

Also Read: లిక్కర్‌ కేసులో మరో నిందితుడికి ఊరట.. సుప్రీకోర్టు బెయిల్ మంజూరు

ఇదిలాఉండగా ఇటీవల కాంగ్రెస్ మహిళా నేత, పీఎస్‌సీ సభ్యురాలు సిమీ రోస్ బెల్‌ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ఎవరైతే పార్టీ పెద్దలకు దగ్గరగా ఉంటారో వారికే అవకాశాలు వస్తాయని ఆరోపించారు. క్యాస్టింగ్‌ కౌచ్ లాంటిదే కాంగ్రెస్‌ పార్టీలో కూడా జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలను కేపీసీసీ మహిళా నేతలు ఖండించారు. సిమీ రోస్‌ బెల్‌పై చర్యలు తీసుకోవాలని కేపీసీసీ నాయకత్వానికి అభ్యర్థించారు. దీంతో సిమీ రోస్ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ ప్రమాణాలను ఉల్లంఘించేలా ఉందని కేపీసీసీ అభిప్రాయపడింది. చివరికి ఆమెను పార్టీలో నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Also Read: సీఎం రేవంత్‌కు అమిత్‌షా ఫోన్.. తెలంగాణకు తక్షణ సాయం!

మరోవైపు పార్టీ చేసిన ఆరోపణలపై సిమీ రోస్‌ బెల్‌ కూడా స్పందించారు. కాంగ్రెస్‌లో గౌరవప్రదమైన మహిళలు పనిచేయలేకపోతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కొంతకాలం పాటు కష్టపడిన వ్యక్తిని బహిష్కరించారంటూ మండిపడ్డారు. వాళ్లు చేసిన ఆరోపణలకు ఏదైనా ఆధారాలు ఉంటే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు