లోక్‌సభ(LokSabha) జరుగుతోంది.. ఎవరో ఇద్దరు ఆగంతకులు సెక్యూరిటీ కళ్లగప్పి లోపలికి దూసుకొచ్చారు. షూ లోపల నుంచి బయట తీసిన టీయర్ గ్యాస్ విసిరారు. అంతే అక్కడున్న ఎంపీలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరికి కాళ్లు, చేతులు కదల్లేదు. మరికొందరు పరుగుపరుగునా బయటకు లాగెత్తారు. అక్కడున్న వాళ్ల గుండె దడ పెరిగిపోయింది. అయితే ఇదంతా మిగిలిన ఎంపీల సంగతి.. సభలోనే ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాత్రం బాంబులు విసురుతుంటే లేచి నిలబడ్డారు. అలానే నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఆయనలో ఏ మాత్రం భయం కనిపించలేదు. అదరలేదు.. బెదరలేదు..! ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి...
బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో ఢిల్లీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు వెలుపల నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక మహిళ, రంగు పొగతో నిరసన తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ..కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. సభలో వదిలిన పొగ.. ప్రమాదకరమైనది కాదని తెలిపారు. సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లిస్ట్ ఇదే.. ఐటీ హెడ్ ఎవరో తెలుసా?