మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ.. జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని.. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తాము రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు.
Also Read: కారులో మంటలు.. కట్ చేస్తే నోట్ల కట్టలు.. ఆ పైసలు ఏ పార్టీవి?
అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వరి పంటకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌గా ఇస్తామన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని.. జీఎస్టీ వల్ల రైతు సామాగ్రి ధరలు పెరిగాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటే.. వాళ్ల కోసం మాత్రమే పనిచేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
Also Read: బండి సంజయ్ ఓ దుర్మార్గుడు.. నా కుటుంబాన్ని వేధించాడు.. మంత్రి గంగుల