Ex Minister Mallareddy: మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. మాజీ మంత్రికి మరో చిక్కు! మాజీ మంత్రి మల్లారెడ్డికి కొత్తచిక్కు వచ్చి పడింది. ఆయనకు చెందిన అగ్రికల్చర్ కాలేజీలో కొందరు విద్యార్థులను డీటెన్డ్ చేయడంతో.. వారికి మద్దతుగా వందలాది మంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆందోళన చేస్తున్నారు. By Nikhil 18 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మాజీ మంత్రి మల్లారెడ్డికి (Ex Minister Mallareddy) మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆయనకు సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Mallareddy University) దాదాపు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో వారికి మద్దతుగా ఇతర విద్యార్థులు సైతం ఆందోళనకు దిగడంతో కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే.. వీరి ఆందోళనకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanth Rao) మద్దతు పలికారు. కాలేజీ యాజమాన్యంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఫర్నీచర్ ధ్వంసం: అయితే.. ఆందోళనకు దిగిన విద్యార్థులు కాలేజీలో ఫర్నీచర్ ను సైతం ధ్వసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్యాంపస్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు. పురుగుల భోజనం పెడుతున్నారని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల వసూలు మీద పెట్టిన శ్రద్ధ, తమకు నాణ్యమైన విద్య అందించడంపై యాజమాన్యం పెట్టడం లేదని వారు అంటున్నారు. ఈ అంశంపై మల్లారెడ్డి, కాలేజీ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: Telangana: ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ఎన్నికల ముందు నుంచి వైరం: ఎన్నికల ముందు నుంచి కూడా మల్లారెడ్డి, మైనంపల్లి మధ్య మాటల యుద్ధం జరిగింది. మైనంపల్లి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో మల్లారెడ్డి మల్కాజ్ గిరి టికెట్ ను తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు ఓటమి పాలై.. రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కూడా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ నేతలతో చర్చలు.. ఇటీవల మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ కాలేజీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దీంతో రాజశేఖర్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. అయితే.. తమ కాలేజీలో అక్రమ నిర్మాణాలు లేవని వివరించేందుకే రాజశేఖర్ రెడ్డి నరేందర్ రెడ్డిని కలిశారని బీఆర్ఎస్ నేతలు ఆ సమయంలో చెప్పారు. ఇటీవల మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన ఫొటోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన చర్చలు జరిపారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. తన వ్యాపార విషయాలను చర్చించడానికే డీకే శివకుమార్ ను కలిశానని మల్లారెడ్డి ఆసమయంలో చెప్పుకొచ్చారు. #malla-reddy #ts-politics #mynampalli-hanumatharao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి