Jeevan Reddy: జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నా ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిందని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదని.. కాంగ్రెస్ (Congress) లోనే సోనాగుతానని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తనను ఎవరు సంప్రదించలేదని అన్నారు. కాగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికతో..
బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి నేతల వలసలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar). కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చర్చ జరిగింది. దీనిపై తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. తాజాగా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
బుజ్జగింపులకు లొంగలేదు..
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్‌లు వెళ్లారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అయితే 40 ఏళ్లుగా గౌరవప్రదమైన రాజకీయాలు చేశానంటూ పార్టీ నేతలో జీవన్ రెడ్డి అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగా గౌరవం లేనప్పుడు ప్రజా జీవితం ఎందుకని.. నాకు గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకని ఆయన అన్నట్లు తెలుస్తోంది.