CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్!

TG: సీఎం రేవంత్‌పై ఆషాడ మాసం ఎఫెక్ట్‌ పడింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. మంచి రోజులు లేకపోవడంతో కేబినెట్‌ విస్తరణ వాయిదా పడినట్లు సమాచారం. కాగా శ్రావణమాసంలోనే పదవుల భర్తీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్!

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌కు హైకమాండ్‌ ఝలక్‌ ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion), పీసీసీ అధ్యక్షుడి ఎంపిక (PCC President) వాయిదా పడింది. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణపై ఆషాడ మాసం ఎఫెక్ట్‌ పడింది. మంచి రోజులు లేకపోవడంతో కేబినెట్‌ విస్తరణ వాయిదా వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాత్రి ఖర్గే నివాసంలో రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌, సీఎం రేవంత్‌ సమావేశం అయ్యర్. శ్రావణమాసంలోనే పదవుల భర్తీ ఉండనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష రేసులో మధుయాష్కీ, మహేష్‌ కుమార్‌గౌడ్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ బలరాం నాయక్‌ ఉన్నారు. మరి వీరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి పార్టీ పగ్గాలు అందజేస్తుందో వేచి చూడాలి.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. 1.2కేజీల బంగారం సీజ్

Advertisment
తాజా కథనాలు