Congress: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్..

సీఎం రేవంత్‌కు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపించని రాష్ట్రాల జాబితాలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను కూడా చేర్చింది. మొత్తం 8 రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం ఎందుకు తగ్గిందనే దానిపై అంచనా వేసేందుకు హైకమాండ్‌ కమిటీలను నియమించింది.

Congress: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్..
New Update

ఈసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఏ రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే దానిపై ఓ జాబితాను తయారు చేసింది. ఇలా ఎందుకు జరిగింది అనేదానిపై అంచనా వేసేందుకు ఫ్యాక్ట్‌-ఫైండింగ్‌ కమిటీలను నియమించింది.

Also Read: కేంద్ర కేబినేట్‌లో కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్ధతు ధర

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో ప్రభావం చూపించనట్లుగా గుర్తించారు. అవి.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ. ఈ ఎనిమిది రాష్ట్రాలకు హైకమాండ్ కమిటీ సభ్యులను నియమించింది. వీళ్లందరు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందనేదానిపై అంచనా వేసి రిపోర్ట్‌ తయారు చేస్తారు. ఆ తర్వాత దీన్ని హైకమాండ్‌కు అందజేస్తారు. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కార్‌కు షాక్‌ తగిలినట్లైంది.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సమానంగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 8 ఎంపీ స్థానాలు రాగా.. బీజేపీకి కూడా ఎనిమిది స్థానాలు వచ్చాయి. మిగిలిన స్థానం ఎప్పట్లాగే ఎంఐఎం దక్కించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈసారి 10కిపైగా సీట్లు గెలుచుకుంటుందని రేవంత్ సర్కార్ భావించింది. కానీ 8 స్థానాల్లోనే గెలవడం, మరోవైపు బీజేపీ ఓటింగ్ శాతం కూడా పెరిగి ఆ పార్టీ కూడా 8 స్థానాల్లో గెలవడంతో కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సరిగా ప్రభావం చూపించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Also Read: ప్రధాని మోదీ కారుపై చెప్పు… వీడియో సోషల్ మీడియాలో వైరల్

publive-image

#telangana #congress #cm-revanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe