Women Reservations: మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్ సర్కార్ క్లారిటీ

మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్‌ సర్కార్‌ ఉత్తర్వులిచ్చింది. ఓపెన్ కేటగిరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్‌కు అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ఎలాంటి మార్కింగ్ లేకుండా 33.3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

New Update
CM Revanth Reddy: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ వినతి..

Women Reservations: మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్ సర్కార్ స్పష్టత ఇచ్చింది. ఓపెన్ కేటగిరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్‌కు అవకాశం ఇవ్వనుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో అమలుకి ఆదేశించింది. ఇప్పటివరకు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రత్యేక మార్కింగ్ ఉండగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్ లేకుండా 33.3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

Also Read: ముగిసిన నాలుగో విడత చర్చలు.. ఆ పంటలకే కనీస మద్దతు ధర

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సమాంతర పద్ధతి అమలు చేయాలని స్పష్టతనిచ్చింది. పాత పద్ధతిలో ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీల్లో 100లో 33.3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలాఉండగా.. రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్సెస్‌ రాజేష్‌ కుమార్‌ దరియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూప్‌ – 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్‌ పాయింట్‌ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయ్యాయి. దీన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్సెస్‌ రాజేష్‌ కుమార్‌ దరియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలని మెమో జారీ చేసింది. ప్రస్తుతం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్‌పీఎస్సీతోపాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి

Advertisment
తాజా కథనాలు