Pension Scheme For Women: తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే మరో గ్యారెంటీ అమలుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఒక్కే పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇటీవల ఆరు గ్యారెంటిల్లో రెండు గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కాదు పరిమితి రూ.15 లక్షలకు పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పని సరి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారిపై కసరత్తు చేస్తుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగ అర్హులు అయిన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం.
ALSO READ: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు
ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో గ్యారెంటీని త్వరలోనే అమలు చేయనుంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగు వేస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు సమాయత్తమవుతోందని సమాచారం. లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్‌కార్డునే ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి పింఛన్ లేని కుటుంబంలోని మహిళలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై ఈ పథకానికి ఆమోదం తెలపనున్నట్లు, అనంతరం పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించనున్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రంలోని మహిళలకు ఈ నెల 27న ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన