Hyderabad : దానంకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. హై కోర్టులో పిటిషన్! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని సూచించినట్లు సమాచారం. దానం ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. By srinivas 30 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Danam Nagender : బీఆర్ఎస్(BRS) నుంచి ఇటీవలే కాంగ్రెస్(Congress) లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్(Secunderabad) ఎంపీ అభ్యర్థిగా ఖరారైన ఆయనను.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. ప్లాష్ సర్వేలో అంచనాలు తారుమారు.. ఈ మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు కాంగ్రెస్ తాజాగా నిర్వహించిన ప్లాష్ సర్వేలో దానం నాగేందర్ అభ్యర్థిత్వానికి కంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కే ఓటర్లు అనుకూలంగా ఉన్నట్టు తేలడంతో దానంను పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది కూడా చదవండి : AP : నేడే వారాహి విజయభేరి మోగించనున్న పవన్! హైకోర్టులో పిటిషన్.. ఇదిలా వుంటే.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నాగేందర్‌పై హైకోర్టు(High Court) లో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో చేరిన ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఓటరు బీ రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపింది. బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికైన దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ మెయిల్ ద్వారా స్పీకర్‌కు వినతి పత్రం సమర్పించామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు ఉందా.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై ఏమైనా తీర్పులుంటే సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. దీంతో దానం వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. #congress #danam-nagender #khairathabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి