Telangana Elections: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..

కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా పలువురు నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. మరికొందరు పేర్లను హోల్డ్ లో ఉంచినా.. వారికి కూడా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతల్లో ప్రముఖంగా మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు సహా తదితర నేతలు ఉన్నారు.

Telangana Elections: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..
New Update

Telangana Congress List: తెలంగాణలో ఎన్నికల వేళ కొందరు కాంగ్రెస్(Congress) నేతలకు జాక్‌పాట్ తగిలింది. ఏళ్లుగా పార్టీ టికెట్ కోసం ఎదురు చూస్తున్న నేతలను కాదని, కొత్తగా వచ్చిన నేతలకు టికెట్ వరించింది. ఇప్పుడిదే తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో పార్టీ మారిన, ఇటీవల పార్టీలో చేరిన నేతలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. ఈ విధంగా కొత్తగా పార్టీ చేరి టికెట్లు పొదిన నాయకులు 15 మంది వరకు ఉన్నారు. వీరిలో కొందరు ఇతర పార్టీల్లోంచి కాంగ్రెస్‌లో చేరిన వారు కాగా, మరికొందరు కొత్తగా కాంగ్రెస్‌లో ప్రస్థానం మొదలుపెట్టిన వారు ఉన్నారు.

ఇటీవల పార్టీలో చేరిన వారికి కేటాయించిన స్థానాలు..

☛ ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి
☛ ఆసిఫాబాద్ - శ్యామ్ నాయక్
☛ ముతోల్ - నారాయణ పటేల్
☛ కూకట్ పల్లి - బండి రమేష్
☛ శేరిలింగంపల్లి - జగదీష్ గౌడ్
☛ తాండూరు - మనోహర్ రెడ్డి
☛ సికింద్రాబాద్ కంటోన్మెంట్ - వెన్నెల
☛ మహబూబ్ నగర్ - ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
☛ మునుగోడు - రాజ్ గోపాల్ రెడ్డి
☛ పాలకుర్తి - యశశ్విని
☛ పరకాల - రేవూరి ప్రకాష్ రెడ్డి
☛ వర్ధన్నపేట -నాగరాజు
☛ ఖమ్మం - తుమ్మల నాగేశ్వర్ రావు
☛ పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
☛ పినపాక - పాయం వెంకటేశ్వర్లు

ఇదిలాంటే.. ఇప్పటి వరకు 100 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇంకా 19 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వివిధ కారణాల చేత ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. అయితే, ఈ స్థానాలకు కూడా సీఈసీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, పార్టీలో నేతల మధ్య డిమాండ్ల కారణంగా.. వీటిని వాయిదా వేశారని, ఈ అభ్యర్థుల కేటాయింపు విషయం పార్టీ అధిష్టానమే స్వయంగా చూస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించని 19 సెగ్మెంట్లు ఇవే..

☛ వైరా
☛ కొత్తగూడెం
☛ మిర్యాలగూడ
☛ చెన్నూరు
☛ చార్మినార్
☛ నిజామాబాద్ అర్బన్
☛ కామారెడ్డి
☛ సిరిసిల్ల
☛ సూర్యాపేట
☛ తుంగతుర్తి
☛ బాన్సువాడ
☛ జుక్కల్
☛ పఠాన్ చెరువు
☛ కరీంనగర్
☛ ఇల్లందు
☛ డోర్నకల్
☛ సత్తుపల్లి
☛ నారాయణ్ ఖేడ్
☛ అశ్వారావుపేట

100 సీట్లలో 27 బీసీలకు..

ఇక కాంగ్రెస్ ప్రకటించిన 100 సీట్లలో బీసీలకు పెద్దపీఠ వేసినట్లు కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ కంటే కూడా కొన్ని స్థానాలు ఎక్కువే ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం 100 స్థానాల్లో 27 స్థానాలను బీసీలకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.

Also Read:

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

#telangana-elections #telangana-politics #telangana-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe