Jagan Pawan Revanth CBN: 'సోదరా..'! రేవంత్‌రెడ్డికి జగన్‌, పవన్‌, చంద్రబాబు బెస్ట్ విషెస్‌.. ఏం ట్వీట్ చేశారంటే?

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి జగన్‌, చంద్రబాబు, పవన్‌ విషెస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననని జగన్‌ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

New Update
Jagan Pawan Revanth CBN:  'సోదరా..'! రేవంత్‌రెడ్డికి జగన్‌, పవన్‌, చంద్రబాబు బెస్ట్ విషెస్‌.. ఏం ట్వీట్ చేశారంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైన అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం జరిగింది. సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాటు మరో 10 మంది కాంగ్రెస్ నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. అటు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి అన్నీ వైపుల నుంచి అభినందల వెల్లువెత్తుతుండగా.. తాజాగా ఏపీ సీఎం జగన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశారు.


జగన్‌ ఏం ట్వీట్ చేశారంటే?
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు అంటూ జగన్‌(Jagan)ట్వీట్ చేశారు. 'ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..' అని జగన్‌ ట్వీట్ చేశారు.


పవన్‌ ఏం అన్నారంటే?
అటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో నాకు వ్యక్తిగత స్నేహం ఉందని.. ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సీఎం స్థాయికి ఎదిగారని కొనియాడారు.


చంద్రబాబు ఏం ట్వీట్ చేశారంటే?
తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి చంద్రబాబు(Chandrababu) విషెస్ చెప్పారు. ఆయన ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీటారు.

Also Read: మొదటిసారిగా మంత్రులైన భట్టి, పొన్నం, సీతక్క,పొంగులేటి.. మినిస్టర్స్ పొలిటికల్ ప్రొఫైల్స్ ఇవే!

WATCH:

Advertisment
తాజా కథనాలు