Rythu Bandhu : తెలంగాణ(Telangana) లో రైతులు ఫుల్ అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతులకు అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పింది. రైతుబంధు(Rythu Bandhu) పేరిట రైతన్నలను ఆదుకుంటామని తెలిపింది. దీని అమలు కూడా ప్రారంభించింది. డిసెంబర్ 10న రైతు బంధు నిధుల జమ ప్రారంభం అయింది. అయితే ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి. అది కూడా ౩ ఎకరాలు లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వచ్చాయి. మిగతా వారికి ఇప్పటి వరకు రాలేదు.
Also Read : Gadwal : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక
ఫిబ్రవరి నెలఖారులోపు...
ఈ నెలాఖరు అంటే ఫిబ్రవరి ఎండ్ లోపు తెలంగాణలో రైతులందరి అకౌంట్లలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఫిబ్రవరి 18వ తేదీ వచ్చినా ఇంకా చాలా మందికి రైతుబంధు డబ్బులు జమ కాలేదు. ౩ ఎకరాలకు మించి ఉన్న రైతులకు డబ్బులు అందలేదు. దీంతో తెలంగాణ రైతులు కన్ఫూజన్‌లో ఉన్నారు. తమ అకౌంట్లలోకి డబ్బులు ఎందుకు రాలేదు, అసలు వస్తాయా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లబ్ధి పొందిన రైతులందరికీ పథకం వర్తిస్తుందా లేదా అని అనుమానపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి గత లబ్ధిదారులందరికీ రైతుబంధు ఇస్తామనే చెబుతోంది. కానీ వచ్చే సీజన్ నుంచి 5 ఎకరాలలోపు రైతులకే ఇస్తామని... రైతు బంధు పథకం వర్తించేలా ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఈ ప్రభుత్వ ప్రకటనలతో రైతుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. మరోవైపు రైతుబంధు అర్హుల జాబితా ట్రెజరీకి పంపిచామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఇచ్చినట్లుగా ఎకరానికి రూ. 5 వేలు ఇస్తోంది. ఎన్నికల సమయంలో రైతు భరోసా(Rythu Barosa) కింద ఏటా ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. త్వరలోనే రైతుభరోసాగా రైతు బంధు పథకం మారనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ సీజన్‌లో రూ.15 వేలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్.