Janasena : జనసేన ఎమ్మెల్యేలకు క్లాసులు.. అతనికే బాధ్యతలు అప్పగించిన పవన్!

జనసేన ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 25న 21 మంది అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. విజయవాడలోని పవన్ ఆఫీస్‌లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ జరగనుండగా నాదెండ్ల మనోహర్, బుద్ధప్రసాద్ వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.

Janasena : జనసేన ఎమ్మెల్యేలకు క్లాసులు.. అతనికే బాధ్యతలు అప్పగించిన పవన్!
New Update

Andhra Pradesh : జనసేన (Janasena) పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల భేటీని ఈ నెల 25వ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నిక (Assembly Elections) ల్లో గెలిచిన 21 మంది అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. విజయవాడ (Vijayawada) లోని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆఫీస్‌లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించనుండగా.. శాసన సభ నిబంధనలు, సంప్రదాయాలు, ప్రసంగాలపై కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్‌లు చెప్పనున్నారు. సభలో ఏ విధంగా వ్యవహరించాలన్న వివిధ అంశాలను ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్, గతంలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నట్ల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read : ఏడేళ్లలో 70 పేపర్‌ లీక్‌లు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు

#janasena #21-mlas #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe