Mobile: స్కూళ్లలోకి సెల్ ఫోన్లు నిషేధం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ! స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. 12ఏళ్లకే 97శాతం మంది పిల్లలు మొబైల్ వాడుతున్నట్లు తెలిపింది. విద్యార్థుల ప్రవర్తన తీరు, ఏకగ్రతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. By srinivas 21 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mobile Phones: పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ (Britain) ప్రభుత్వం యోచిస్తోంది. స్కూల్ ప్రాంగణాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ప్రవర్తన, ఏకగ్రతను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల పిల్లలు పక్కదోవ పట్టడంతోపాటు ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారని, దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగానే.. ఈ మేరకు బ్రిటన్‌లోని అన్ని పాఠశాలల్లో 12 ఏళ్ల వయసు నాటికే 97 శాతం మంది పిల్లలు మొబైల్ ఫోన్‌లు కలిగి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే 'తరగతి గదిలో అంతరాలను తగ్గించి.. ప్రవర్తనను మెరుగుపరచడం' అనే ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 'పాఠశాలలు పిల్లలు విద్య నేర్చుకునే ప్రదేశాలు. మొబైల్ ఫోన్‌లు తరగతి గదిలో అవాంఛనీయమైన పరధ్యానాన్ని కలిగిస్తాయి. మేము కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులకు సహాయంగా సాంకేతిక సాధనాలను అందిస్తున్నాం. అలాంటపుడు సెల్ ఫోన్ అత్యవసర సాధనం కాదనేది మా అభిప్రాయం' అని విద్యా కార్యదర్శి తెలిపారు. ఇది కూడా చదవండి : Delhi Chalo: రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ విడిచిన పోలీసులు.. ఒకరు మృతి ఖండించిన టీచర్లు.. అలాగే ఈ మోబైల్ కారణంగా పెద్దలే పక్కదారి పడుతున్నారని, ఈ ప్రభాదం పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే దీనిపై స్పందించిన పలువురు టీచర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పిల్లలు సెల్ ఫోన్ ఎంత వరకూ వాడాలనే సృహ ఉందన్నారు. ప్రభుత్వం దీనిపై కాకుండా స్కూళ్ల నిధులకు సంబంధించిన ఇష్యూపై దృష్టిపెట్టాలని కోరారు. అయితే పిల్లల తల్లదండ్రులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. #mobile-phones #complete-ban #uk-schools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి