ఒలంపిక్స్‌లో 7 నెలల గర్భిణిగా పోటీ చేసిన మహిళా ఫెన్సర్!

ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా పాల్గొని సంచలనం సృష్టిచింది. నాడా హఫీజ్ ఫెన్సర్ విభాగంలో 15-7తో దక్షిణ కొరియా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయి టోర్మీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒలంపిక్స్‌లో 7 నెలల గర్భిణిగా పోటీ చేసిన మహిళా ఫెన్సర్!
New Update

ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్ క్రీడలు 26న పారిస్‌లో రంగుల వేడుకతో ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ నుంచి వంద మందికి పైగా క్రీడాకారులు పారిస్ వెళ్లారు. భారత అథ్లెట్లు మంచి ప్రదర్శనను కొనసాగిస్తున్నారు.

కాగా, ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా పాల్గొన్నట్లు వెల్లడించి సంచలనం రేపింది. నాదా హఫీజ్ తన సోషల్ మీడియా పేజీలో, 'పోడియంపై ఇద్దరు ఆటగాళ్లు ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ ముగ్గురు ఉన్నాము. నేను, నా తోటి పోటీదారు  నా కడుపులో ఉన్న బిడ్డ అని ఆమె పోస్ట్ లో తెలిపారు.

మహిళల వ్యక్తిగత సాబర్ తొలి రౌండ్‌లో నాడా హఫీజ్ 15-13తో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై విజయం సాధించింది. తర్వాతి రౌండ్‌లో ఆమె 15-7తో దక్షిణ కొరియా క్రీడాకారిణి జియోన్ హ్యోంగ్ చేతిలో ఓడిపోయింది.

'నా బిడ్డ నేను శారీరకంగా మానసికంగా సవాళ్లను ఎదుర్కొన్నాము. గర్భం 'రోలర్ కోస్టర్' కఠినమైనది, కానీ జీవితం క్రీడల సమతుల్యతను కాపాడుకోవడానికి పోరాటం కూడా అంతే. అయితే ఇది విలువైనదే' అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.నాదా హఫీజ్ చేసిన ఈ స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌కు చాలా మంది తమ అభినందనలు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#paris-olympics-2024 #olympic-2024 #paris
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe